KTR | ఫార్ములా ఈ రేసు కేసు పేరిట రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్ల నాలుగు నెలలైందని.. ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలు, యంత్రాంగం అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉన్నా.. బ్యాంక్ ద్వారా అధికారికంగా నిధులు బదిలీ చేసిన ఫార్ములా-ఈ అంశం మీద మాత్రమే కేసు పెట్టగలిగారని తెలిపారు. ఈ ఏసీబీ ఛార్జ్‌షీట్ రేవంత్ ప్రభుత్వం ఎంత నిస్పృహలో ఉందో చూపించడమే కాకుండా, మా హయాంలో జరిగిన మచ్చలేని పాలనకు సర్టిఫికేట్ లాంటిదని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఈ ఛార్జ్‌షీట్ ద్వారా స్పష్టం అవుతోందని కేటీఆర్ తెలిపారు. కేవలం అభివృద్దే లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపామని స్పష్టం చేశారు. ఫార్ములా-ఈ రేస్ ద్వారా హైదరాబాద్‌ను ప్రపంచ నగరాల సరసన నిలిపేందుకు ఉపయోగించిన ₹49 కోట్ల బ్యాంక్-టు-బ్యాంక్ నిధుల బదిలీని కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ అంటుందా? అని ప్రశ్నించారు. స్కాంగ్రెస్ నాయకులారా.. రండి చూసుకుందామని సవాలు విసిరారు.
Two years and 4 months since coming to power
Two years of access to all documents and government machinery!
And all that you could file a case was in Formula E where funds were transferred from bank to bank!!!
This ACB charge sheet not just symbolises a clear desperation from…
— KTR (@KTRBRS) March 25, 2026
అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సమయంలోనూ.. తాను మొదటినుంచి చెప్తున్నట్టు ఫార్ములా ఈ రేసు ఒక లొట్టపీసు కేసు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇక్కడి బ్యాంకు నుంచి పంపిన రూ.45 కోట్లు అకడి బ్యాంకు అకౌంట్లో భద్రంగా ఉన్నాయని, ఎకడా నిధుల దుర్వినియోగం జరుగలేదని స్పష్టంచేశారు. ఇందులో ఏమీలేదని ప్రభుత్వమే చార్జిషీట్లో ఒప్పుకున్నదని చెప్పారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌పై బీఆర్ఎస్ తెస్తున్న ప్రైవేట్ మెంబర్ బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మళ్లీ తెరపైకి ఫార్ములా కేసు చార్జిషీట్ తెచ్చారని విమర్శించారు.