హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ‘ఎక్స్’ వేదికగా సెటైర్లు వేశారు. ‘మరోసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు.
వెల్డన్’ అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఈ ట్వీట్‌కు గతంలో తాను మాట్లాడిన వీడియోను కేటీఆర్ జత చేశారు.