KTR | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఢిల్లీకి మూటలు మోసుడు కాదు.. రైతుల గోస చూడమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. కల్లబొల్లి మాటలతో కాలయాపన చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే కుట్రలు చేయడం మినహా సీఎం ఒరగబెట్టిందేమీ లేదని ఎక్స్‌వేదికగా పోస్ట్ చేశారు.
కాగా ఎంబీసీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని ఎంబీసీ సంచార జాతుల సమితి అధ్యక్షుడు నిర్మల వీరన్న కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసి.. బీసీ, ఎంబీసీ, సంచార కులాల సమస్యలపై చర్చించారు.
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరుకానున్నారు. మైటా ప్రతినిధులు బుధవారం కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్ల క్రితం మైటాను ప్రారంభించగా.. ఈ నెల 9న దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నది. దీంతో కేటీఆర్ మలేషియాకు వెళ్లనున్నారు.