Sukesh Chandrasekhar | గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్‌కు తేడా తెలియదా?.. సుకేశ్ తప్పుడు ఆరోపణలపై సోషల్‌మీడియాలో ట్రోల్స్
Sukesh Chandrasekhar | ఉద్దేశపూర్వక, నిరాధార ఆరోపణలు చేసిన సుకేశ్ చంద్రశేఖర్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే పరువునష్టం కేసు (సివిల్, క్రిమినల్) వేయటంతోపాటు జరిగిన పరువు నష్టానికి పరిహారం కోరనున్నట్టు వెల్లడించారు.
Sukesh Chandrasekhar | హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ఉద్దేశపూర్వక, నిరాధార ఆరోపణలు చేసిన సుకేశ్ చంద్రశేఖర్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే పరువునష్టం కేసు (సివిల్, క్రిమినల్) వేయటంతోపాటు జరిగిన పరువు నష్టానికి పరిహారం కోరనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు సుకేశ్ తరఫు లాయర్ అనంత్ మాలిక్ ద్వారా నోటీసు పంపారు. మరోసారి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయవద్దని, ఇప్పుడు చేసినవి తప్పుడు వ్యాఖ్యలు అని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని లేఖ రాసివ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కృష్ణదేవ్ నోటీసులో పేర్కొన్నారు.
తెలంగాణ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు పేరుతో రాసిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ సమాజంలో గౌరవ, మర్యాదలు ఉన్న వ్యక్తి అని, తప్పుడు ఆరోపణలతో, ఎలాంటి ఆధారాలు లేకుండా పరువు ప్రతిష్ఠలు దెబ్బతిసేలా పబ్లిసిటీ రావాలనే విధంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. వివిధ రకాల క్రిమినల్ కేసుల్లో జైల్లో ఉన్న వ్యక్తి సమాజంలో గౌరవ మర్యాదలున్న వ్యక్తిపై దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్ ఇంతవరకు ఏనాడూ సుకేశ్‌ను కలవలేదని స్పష్టం చేశారు. అనేక కేసులతో జైల్లో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేయటం ద్వారా సమాజం దృష్టి మళ్లించే ఉద్దేశం ఉన్నదని అనుమానాన్ని వ్యక్తం చేశారు. మీడియాలో ప్రచారం కోసం, మీడియాను తనవైపు తిప్పుకొనేందుకు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు.
గవర్నర్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు తేడా తెలియదా?
సుకేశ్ తప్పుడు ఆరోపణలు, ఆయన న్యాయవాది గవర్నర్‌కు రాసినట్టుగా చెప్తున్న లేఖ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతున్నది. ఆ లేఖలో తెలంగాణ గవర్నర్‌ను లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా సంబోధించారు. తెలంగాణకు గవర్నర్ ఉంటారు కానీ ఆ లేఖలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అని రాశారు. వాట్సాప్ యూనివర్సిటీకి గవర్నర్‌కు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు తేడా తెలియదంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడ్డారు. ఈ మాత్రం అవగాహన లేదా? అని సుకేశ్ న్యాయవాది అనంత్ మాలిక్‌ను ఓ రేంజ్లో ఆడుకున్నారు. ఆయన బీజేపీ నాయకులు చేసిన ట్వీట్లకు లైక్‌లు కొడుతున్నారని ఆధారాలతో సహా బయటపెట్టారు. దీన్ని బట్టి సుకేశ్ వెనకాల ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులే ఇలాంటి చిల్లర పనులు చేయిస్తున్నారని నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

