హైదరాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజాస్వామిక తెలంగాణలో మరోసారి ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెల్లవారే రోజులొచ్చాయని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కులను అడిగితే బెదిరింపులకు పాల్పడుతారని, పోరాడితే సస్పెన్షన్లు చేస్తారని మండిపడ్డారు. ఇది నియంతృత్వ రాజ్యమని, ప్రభుత్వం నిర్బంధాన్ని నిర్మిస్తున్నదని చెప్పారు.
పోరాటం తెలంగాణకు కొత్తకాదని, ఈ మట్టి పొత్తిళ్లలోనే పోరాటం ఉన్నదని తెలిపారు. ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తామని, ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతామని చెప్పారు. హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలులో ఉండగా, 13 జిల్లాల్లో అధికారికంగా, 20కిపైగా జిల్లాల్లో అనధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘పోరాడి సాధించుకొని..
పదేళ్లు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..
ప్రజాస్వామిక తెలంగాణలో..
మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయి..
ఇందిరమ్మ రాజ్యంలో
ప్రశ్నిస్తే కేసులు…
హక్కులను అడిగితే బెదిరింపులు..
పోరాడితే సస్పెన్షన్లు…
ఇది నియంతృత్వ రాజ్యం…నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం..
పోరాటం తెలంగాణకు కొత్తకాదు..ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నది..
ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తాం..
ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతాం.’’
పోరాడి సాధించుకొని..
పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..
ప్రజాస్వామిక తెలంగాణలో..
మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయి..ఇందిరమ్మ రాజ్యంలో
ప్రశ్నిస్తే కేసులు…
హక్కులను అడిగితే బెదిరింపులు..
పోరాడితే… pic.twitter.com/vmFnf0zmoP— KTR (@KTRBRS) November 2, 2024