హైదరాబాద్: కంప్యూటర్ను పుట్టించిందే మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. చిట్టినాయుడు సుభాషితాలు బాగున్నాయంటూ ఎద్దేవా చేశారు. కంప్యూటర్ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదని చార్లెస్ బాబేజ్ అని చెప్పారు. దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ కాదని.. 1956లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటర్ రిసెర్చ్ ఆటొమెటిక్ క్యాలిక్యూలేర్ (TIFRAC) వారు తొలిసారి కంప్యూటర్ సేవలను ప్రారంభించారని చెప్పారు. రాజీవ్ గాంధీకి అప్పటికి 12 ఏండ్లేనని తెలిపారు. ఏదో నోటికి వచ్చింది వాగడం ఎందుకు.. ఆ తర్వాత దొరికిపోవడం ఎందుకని ఎద్దేవాచేశారు. మీకు బాగా తెలిసిన రియల్ ఎస్టేట్ దందాలు, బ్లాక్ మెయిల్ వంటి వాటికి పరిమితం అయితే మంచిదమ్మా చిట్టి అంటూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌కు చురకలంటించారు.
చిట్టినాయుడు సుభాషితాలు
✳️ రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండు
❌ కంప్యూటర్ ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు చార్లెస్ బాబేజీ
✳️ రాజీవ్ గాంధీ కంప్యూటర్ దేశానికి పరిచయం చేసిండు
❌ Tata Institute of Fundamental Research Automatic Calculator (TIFRAC) వారు 1956లో ఇండియాలో…
— KTR (@KTRBRS) September 17, 2024
సచివాలయం ఎదుట ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంప్యూటర్ను పుట్టించిందే మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ అని పేర్కొన్నారు. సెల్ఫోన్లు, కంప్యూటర్ను మన దేశానికి పరిచయం చేసింది ఆయనే అని, దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్‌గాంధీకే దక్కుతుందని చెప్పారు. గాంధీల కుటుంబానిది త్యాగాల చరిత్ర అంటూ కొనియాడారు. ఈ నేపథ్యంలో రేవంత్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ – చిట్టి నాయుడు..
సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే – చంద్రబాబు నాయుడు…
— Ganesh svs (@TelanganaGanesh) September 17, 2024