హైదరాబాద్ జూలై 17 (నమస్తే తెలంగాణ): ‘డీజీపీ, తెలంగాణ సైబర్ సెక్యూరిటీబ్యూరో గారు.. తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉన్న మీరు మీ రాజకీయ బాసుల ఆదేశాలను పాటించడం విడ్డూరం. వారి ఆదేశాల మేరకు అమాయకులను అక్రమ కేసుల్లో జైళ్లకు పంపడం బాధాకరం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మీరు వేసుకున్న పవిత్రమైన ఖాకీ బట్టలకు విలువ ఇవ్వండి.
అత్యున్నతమైన ఆల్ ఇండియా సర్వీసుల్లో ఉన్న విషయాన్ని మరిచిపోకండి..’ అని ఎక్స్ వేదికగా చురకలంటించారు. బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో చేసిన పోస్టులను రీట్వీట్ చేశాడనే నెపంతో సోషల్ మీడియా యాక్టివిస్ట్ శశిధర్గౌడ్ను 17 రోజులు జైల్లో పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. ఈ రోజు బెయిల్ వచ్చి విడుదలయ్యే సమయానికి మరో అక్రమ కేసుపెట్టి రామగుండం పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. మీ రాజకీయ బాసుల ఆదేశాలు పాటిస్తున్న మీకు వ్యక్తుల భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారనే విషయం తెలియడంలేదా? అని ప్రశ్నించారు.