హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏం జరుగుతున్నది? అం టూ మంగళవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చిన్నారుల చావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు చెలరేగుతున్నాయని మండిపడ్డారు. అబద్ధాలు, పగలు, ప్రతీకారా లు, దాడులు, దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నామని విమర్శించారు. ధర్నాలు, దీక్షలు, కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఢిల్లీ టూర్లు, అప్పులు, తప్పులు, డైవర్షన్లు, స్టం ట్లు, బూతులు, లూటీలు జరుగుతున్నాయని చెప్పారు.