మద్దూర్ (కొత్తపల్లి) ఫిబ్రవరి 8 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో రైతుల నిరసన దీక్ష-బహిరంగసభ నిర్వ హిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందరెడ్డి తెలిపారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సబితాఇంద్రారెడ్డి హాజరుకానున్నట్టు పేర్కొన్నారు.
శనివారం ఆయన నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రా మంలో మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రైతులు అడుగడుగునా మోసపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గత నెల 26న కోస్గి మండలం చంద్రవంచలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు సంక్షేమ పథకాలకు అంకురార్పణ చేస్తున్న ట్టు ప్రకటించినా నేటికీ ఏ ఒక్క పథకాన్ని సంపూర్ణంగా అందించిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులను ఆదుకునేందుకు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతుబంధు డబ్బులను వారి ఖాతాల్లో జమ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2,500 చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఊసే లేకుండా పోయిందని మండి పడ్డారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. 10న కోస్గిలో నిర్వహించే దీక్ష-బహిరంగసభ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.