బోయినపల్లి (వేములవాడ), మార్చి 23: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ఎస్సై తీరుపై మానవహకుల సంఘాన్ని ఆశ్రయిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఇటీవల అక్రమంగా పోలీసులు అరెస్టు చేసిన మాజీ సర్పంచ్ నందయ్యను మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, చల్మెడ లక్ష్మీనరసింహారావు, రమణతో కలిసి ఆయన నివాసంలో ఆదివారం పరామర్శించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకోకుంటే మానవ హకుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.