KTR | సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ఏలుబడిలో వృద్ధులు పింఛన్ల కోసం పడిగాపులు పడుతున్నారు. నెలానెలా సరైన సమయంలో పింఛన్లు ఇవ్వకపోవడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో నిత్యం ఎక్కడో చోట పింఛన్ల కోసం రోడ్డెక్కుతున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో పింఛన్ వృద్ధులు రోడ్డెక్కారు. వెంటనే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో నెలనెలా సక్రమంగా పింఛన్ వచ్చేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చినంక పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూడాల్సి వస్తుందని వాపోయారు. 18 నుంచి 20వ తేదీలోగా పోస్టాఫీసుల్లో ఇచ్చేవారని.. నవంబర్ 25వ తేదీ వచ్చినా ఇంకా డబ్బులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండురోజుల్లోనే వచ్చేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వృద్ధులు శాంతించారు.
వృద్ధుల ఆందోళనపై ‘నమస్తే’లో ప్రచురితమైన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. తెలంగాణాలో పింఛన్ల కోసం కోసం వృద్దులు రోడ్డెక్కుతారని ఎవరు అనుకున్నారు.. టంచన్‌గా అకౌంట్లో పడే పడే పైసలు ఆగిపోతాయని ఎవరునుకున్నారు? అన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ కోసం లాక్షా యాభై వేల కోట్లు వెదజల్లి.. కనికరం లేకుండా వృద్ధుల పెన్షన్ డబ్బులను ఆపుతారని అనుకున్నారన్నారు. మందుబిల్లల కోసం కొడుకులు, కోడళ్ల దగ్గర చేయిచాచే అవసరమే లేని రోజుల నుంచి మళ్లీ వేడుకునే ‘మార్పు’ వస్తుందని ఎవరు ఊహించారని.. అణువణువునా కర్కశత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఇక్కట్లే ఉంటాయని ఎవరనుకున్నారు..? మార్పు ఇంత మోసగిస్తుందని ఎవరనుకున్నారు? అంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.