హైదరాబాద్ : మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన పాఠశాలలో ఉన్నప్పటి ఫొటోను క్రిష్ రాజ్మురారి అనే జర్నలిస్ట్ శనివారం ట్విట్టర్లో పెట్టారు. ‘కేటీఆర్ మీకు జ్ఞాపకం ఉందా… ఎన్పీఎస్ (నలంద పబ్లిక్ స్కూల్) 1988 బ్యాచ్.. ఈ ఫొటోలో ఎవరైనా ప్యూచర్ లీడర్ని గుర్తించగలరా..? కేటీఆర్ ఎక్కడ ఉన్నారు గుర్తించండి’ అని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ‘ఈ చిత్రానికి ధన్యవాదాలు. నలంద పబ్లిక్ స్కూల్లో నా హాస్టల్ రోజులను ఈ ఫొటో గుర్తుచేసింది’ అని బదులిచ్చారు. నెటిజన్లు చిత్రంలో కేటీఆర్‌ను గుర్తించే ప్రయత్నం చేశారు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జన్మదినం సందర్భంగా మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘లెజెండ్ సచిన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. స్టే బ్లెస్డ్ సచిన్ జీ’ ట్వీట్ చేశారు.
పేదింటి ఆడబిడ్డ ఎంబీబీఎస్ చదువుకు సాయం చేస్తానని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెండు మండలం మసివాగు గ్రామానికి చెందిన రమేశ్, రమాదేవి కూతురు అంజలికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఆమె తండ్రి ఆటో డ్రైవర్ రూ.1.10లక్షలు కట్టి కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. కానీ, ఇతర ఖర్చులకు మరో రూ.రెండు లక్షలు కావాలి. అంత పెట్టే స్థోమత లేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు అన్న’ అని కేటీఆర్‌కు మహేందర్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ ఆఫీస్‌ను ఆదేశించారు.
Thanks for this picture 😊
Brought back lots of memories from my hostel days at Nalanda https://t.co/yH0y8LoJTr
— KTR (@KTRTRS) April 24, 2022