హైదరాబాద్, డిసెంబర్ 26(నమ స్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అక్రెడిటేషన్ల జారీ కోసం కొత్తగా జారీ చే సిన జీవో 252తో జర్నలిస్టులకు తీరని అ న్యాయం జరుగుతుందని రాష్ట్ర బీసీ క మిషన్ మాజీ సభ్యుడు, న్యాయవాది ఉపేంద్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఒక జీవోతో 14 వేల మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్లలో కోత విధించేలా తీసుకువచ్చిన జీవోను వెంటనే సవరించాలని శుక్రవారం ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చే శారు. ఈ జీవోతో జర్నలిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని మండిపడ్డారు. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల మధ్య విభజన రేఖలు సృష్టించి, విభేదాలకు తెరతీసేలా జీవోలో విధానాలు పొందుపర్చడంపై ఆగ్రహించారు.
జర్నలిజానికి రెండు కైండ్లె న డెస్, ఫీల్డ్ జర్నలిస్టులను రెండు క్యాటగిరీలుగా విభజించడం సరికాద ని మండిపడ్డారు. జర్నలిస్టుల ప్రాథమిక హకు ను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాని కి వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో జ ర్నలిస్టులకు తెలంగాణ న్యా యవాదు ల జేఏసీ అండగా ఉంటుందని భరో సా ఇచ్చారు. జర్నలిస్టుల హకుల కోసం అనుబంధంగా పోరాడుతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన జర్నలిస్టులకు అన్యాయం జరిగితే స హించే ప్ర సక్తే లేదని హెచ్చరించారు. ప్రభు త్వం వెంటనే జీవోలో మార్పులు చేయకపోతే, జర్నలిస్టులతో కలిసి ఉద్యమాల్లో పాల్గొంటామని స్పష్టంచేశారు.