KTR | దేశ రాజధాని ఢిల్లీలో నిన్న జరిగిన ఆందోళనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. యువత ఆకాంక్షలు తీర్చకపోతే జెన్ జీ ఆందోళన తప్పదని పది నెలల క్రితమే చెప్పానని గుర్తుచేశారు. దానికి నిన్నటి ఢిల్లీ నిరసనలే ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి విద్యా సంస్థకరణలు, పాలనలో జవాబుదారీతనాన్ని తీసుకురావాలని కేటీఆర్ సూచించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. గత ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన ముంబైలో జరిగిన NDTV Yuva 2025 – The Mumbai Chapter” సదస్సులో ఆయన మాట్లాడిన ఓ వీడియోను షేర్ చేశారు.
About 10 months ago, I had made a comment at a media event that a Gen-Z protest is imminent in our country if the aspirations of youngsters are not addressed
After yesterday’s Delhi protest, it is high time for the Union Govt to address the demand for accountability and… pic.twitter.com/9kTIDx9Oi8
— KTR (@KTRBRS) July 21, 2026
యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని, విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉన్నదని నాడు కేటీఆర్ హెచ్చరించారు. నేపాల్, శ్రీలంక తరహాలో భారతదేశంలో కూడా ఉద్యమాలు రావని చెప్పలేమని పేర్కొన్నారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్ చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ, మందిర్-మసీద్, ఎవరు ఏం తింటున్నారు? ఎవరేం కట్టుకుంటున్నారన్న అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధాని మోదీ విజయం సాధించారని ఎద్దేవా చేశారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి, ఆవిషరణలను మోదీ గాలికొదిలేశారని విమర్శించారు. చైనా, జపాన్, అమెరికా వంటి పశ్చిమ దేశాలతో పోటీపడి వారిని అధిగమించే ప్రయత్నం చేయాలే తప్ప, మనకన్నా వెనుకబడిన దేశాలతో పోల్చుకుని సంతృప్తి చెందడం సరికాదని హితవుపలికారు.