హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగా ణ): వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం16 చింతలతండాలో ప్రేమోన్మాది చేతిలో దారుణహత్యకు గురైన గిరిజనకుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకొచ్చారు. నిందితుడు నాగరాజు చేసిన దాడిలో తల్లితండ్రులిద్దరూ శ్రీనివాస్, సుగుణ చనిపోవటంతో ఆ కుటుంబంలోని ఇ ద్దరు పిల్లలు దీపిక, మదన్ అనాథలయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడి కోలుకున్న పిల్లలిద్దరినీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మంగళవారం కేటీఆర్ వద్దకు తీసుకొచ్చారు.
కేటీఆర్ వారి ఆరోగ్యం గురించి వాకబు చేసి ధైర్యంగా ఉండాలని చెప్పారు. దీపిక, మదన్‌ల చదువు బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ అయిన సుగుణ బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త కావడం తో పార్టీ తరఫున కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. ఈ కుటుంబానికి భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల సాయం అందించాలని కోరారు.
పాలకుర్తిరూరల్, జూలై 16: జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో కో లా శ్రీను (33) మృతితో అనాథలైన ముగ్గురు చిన్నారులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆ కుటుంబానికి వ్యక్తిగతంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కోలా శ్రీనుకు 12 ఏండ్ల క్రితం లలితతో వివాహమైం ది. ముగ్గురు ఆడ బిడ్డలు రక్షిత, రిషిత, రితిక జన్మించారు. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల శ్రీను అనారోగ్యానికి గురై గురువారం మృతి చెందాడు.
ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉండటంతో దహన సంస్కారాలు కూడా జరిపించలేని పరిస్థితి. దీంతో గ్రామస్థులు విరాళాలు సేకరించి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి వడ్లకొండ వినయ్ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు. వారి కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆదుకుంటామని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.