కారేపల్లి : బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా గ్రామాలలో ఆ పార్టీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై యువకుల్లో క్రేజ్ మామూలుగా లేదు. వివిధ గ్రామాల్లో యువకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోలతో కూడిన టీ షర్టులు, టోపీలు ధరించి తమ అభిమానం చాటుకుంటున్నారు.
తాజాగా ఓ యువకుడు ఏకంగా తన స్కూటీ నెంబర్ ప్లేట్‌పై కేటీఆర్ ఫొటో పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఆ యువకుడు నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. పదేళ్ల సుపరిపాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ అన్నా, కేటీఆర్ అన్నా తనకు చాలా ఇష్టమని చెప్పారు.
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చి కేసీఆర్, కేటీఆర్ పాలనను ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపాడు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు.