హైదరాబాద్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ (Chakali Ilamma) జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ఐలమ్మ ప్రతీక అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం, త్యాగం చిరస్మరణీయమని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ గారు ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక. భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం, త్యాగం చిరస్మరణీయం. చాకలి ఐలమ్మ స్పూర్తిని ప్రపంచానికి చాటే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఐలమ్మ గారి జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారు. పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారు. చిట్యాల ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.