హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జనజీవన ఆరాట పోరాటాలను కథలుగా మలుస్తున్న గొప్ప రచయిత పెద్దంటి అశోక్‌కుమార్ అని, ఇటీవల ఆయన రాసిన ‘మాయి ముంత’ కథలను చదివానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్టు చేశారు.
అందులో ‘మాయి ముంత’, ‘సావు దప్పు’, ‘జిద్దు’ వంటి కథలు తనను లోతుగా కదలించాయని తెలిపారు. అవి కేవలం కథలు మాత్రమే కాదని, మన అస్థిత్వపు వేదనలని పేర్కొన్నారు. భారతీయ సాహిత్యంలో కలకాలం నిలిచిపోయే అద్భుతమైన రచనలు అని కొనియాడారు.