హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘కట్టలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టాం అన్నారు. మరి లక్ష ఇండ్లు రాత్రికి రాత్రికి ఎకడ నుంచి పుట్టుకొచ్చాయి చిట్టీ…’ అని డబుల్ బెడ్రూం ఇండ్లపై సర్కారు అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రం విసిరారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల ఫొటోలను, పత్రికల్లో వచ్చిన ప్రత్యేక కథనాలను ట్యాగ్ చేస్తూ ఆయన ఎక్స్‌వేదికగా పోస్ట్ చేశారు.
‘మేము నిర్మిస్తే.. మీరు కూల్చేస్తున్నారు. మాది నిర్మాణం .. మీది విధ్వంసం. లక్షల నిర్మాణాలు మావి ..లక్షల కూల్చివేతలు మీవి. మూసినది సాక్షిగా మహానగరంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు. కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్ష్యం’ అని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన దృశ్యాలను చూసి మింగుడు పడటం లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ జూటా మాటలు, కుట్రలకు, పనుల డ్యామేజ్ కంట్రోల్‌కు కేసీఆర్ నిర్మాణాలే దికయ్యాయని ఆయన విమర్శించారు. కేసీఆర్ లక్ష డబుల్ నిర్మాణాలు నిజం…కేటాయింపులు నిజమని ఆయన స్పష్టం చేశారు.