హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ రేసుపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు వెలువరించిన తీర్పును బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, కల్వకుంట్ల తారకరామారావు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఏసీబీ కేసును సవాలు చేస్తూ వేసిన క్వాష్ పిటిషన్‌ను మంగళవారం తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మంగళవారం సాయంత్రం కేటీఆర్ న్యాయవాది మోహిత్‌రావు సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కేటీఆర్‌పై కేసు నమోదు చేయడం రాజకీయ కక్షసాధింపేనని, ప్రాథమిక విచారణ లేకుండానే ఏసీబీ కేసు నమోదు చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషనర్ ఆర్థిక ప్రయోజనం పొందినట్టు ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొన్నారు.
ఫార్ములా ఈ రేసు వల్ల తెలంగాణ ప్రతిష్ఠ విశ్వవ్యాప్తంగా పెరిగిందని, ఆర్థికంగా కూడా రాష్ట్రానికి మేలు జరిగిందని తెలిపారు. ఫార్ములా ఈ వల్ల రాష్ట్రానికి రూ.110 కోట్ల లాభం వచ్చిందని వెల్లడించారు. ఫార్ములా-2 రేస్ నిమిత్తం ప్రభుత్వం, ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ), ఏస్ నెక్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరిందని, ఇందులో 10వ సీజన్ తరువాత ప్రమోటర్ వెళ్లిపోవడంతో ప్రభుత్వమే చెల్లింపులు జరిపి రేస్ నిర్వహణకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
ఇది విధాన నిర్ణయమని, ఇందులో తప్పుఒప్పులు ఉంటే వాటిని ప్రభుత్వమే సరిదిద్దుకోవాలని అన్నారు. నిధుల దుర్వినియోగం లేనప్పడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1)(ఏ) కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదని తెలిపారు. పీసీ యాక్ట్ సెక్షన్ 13(2)పెట్టడానికి నేరపూరిత ప్రవర్తన ఎకడా లేదని, ఐపీసీ 409 కింద ఏ ఒక ఆధారం ఏసీబీ దగ్గర లేదని తెలిపారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ చూస్తే ఈ విషయాలు తెలుస్తాయన్నారు. ఒప్పందంలో మధ్యవర్తిత్వ క్లాజ్ ఉందని, దీనిని కోర్టులో సవాలు చేయడానికి వీల్లేదని వివరించారు. ఎఫ్ఐఆర్పై తదుపరి ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని బుధవారం సుప్రీంకోర్టును అభ్యర్థించే అవకాశముంది.
కేవియట్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మంగళవారమే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఈ ఫార్ములా కేసులకు సంబంధించిన ఏదైనా తీర్పు ఇచ్చేముందు తమ వాదనలు కూడా వినాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది.