KTR : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నిమ్మల శంకర్(N Shankar)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరామర్శించారు. మాతృమూర్తిని కోల్పోయిన బాధలో ఉన్న శంకర్‌ను కలిసిన కేటీఆర్ ధైర్యం చెప్పారు. సోమవారం దర్శకుడి నివాసానికి వెళ్లిన ఆయన.. చిత్రపటానికి పూల మాల వేసి, నివాళులు అర్పించారు.
‘జై బోలో తెలంగాణ’ చిత్రంతో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను చాటిచెప్పిన నిమ్మల శంకర్ తల్లి నిమ్మల సక్కుబాయమ్మ గత వారం స్వర్గస్తులయ్యారు. మాతృమూర్తిని కోల్పోయిన ఆయనను కేటీఆర్ పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే ఎల్.రమణ, బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర నాయకులు ఉన్నారు. శంకర్ ఇంటికి వెళ్లి ఆయన తల్లి సక్కబాయమ్మకు నివాళులు అర్పించిన విషయాన్ని కేటీఆర్ ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
ప్రముఖ సినీ దర్శకుడు నిమ్మల శంకర్ గారి మాతృమూర్తి నిమ్మల సక్కుబాయమ్మ గారు గత వారం స్వర్గస్తులయ్యారు. ఈ రోజు శంకర్ గారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించాను. pic.twitter.com/ttvHx0PFUM
— KTR (@KTRBRS) February 2, 2026