హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం పార్టీ తరఫున నియమించిన త్రిసభ్య కమిటీతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమావేశమయ్యారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, సమస్యలను పరిశీలించేందుకు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే సంజయ్‌తో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య నేతృత్వంలో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. త్రిసభ్య కమిటీ నేటి నుంచే కార్యాచరణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేటీఆర్‌తో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
గాంధీ హాస్పిటల్లో మాతా శిశు మరణాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన వైద్య ఆరోగ్య పరిస్థితుల పతనంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. గాంధీతోపాటు రాష్ట్రంలోని పలు హాస్పిటళ్లను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నిర్మాణాత్మకమైన సూచనలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది.
రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం పార్టీ తరఫున నియమించిన త్రిసభ్య కమిటీతో తెలంగాణ భవన్లో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
రాష్ట్రంలో దిగజారిన వైద్య ఆరోగ్య వ్యవస్థపై అధ్యయనం కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజయ్య… pic.twitter.com/GpwDyBMxQx
— BRS Party (@BRSparty) September 22, 2024