చిన్నకోడూర్, అక్టోబర్ 17 : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో శుక్రవారం బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ పరామర్శించారు. శ్రీనివాస్ తండ్రి ఎర్రోళ్ల విజ్జయ్య ఇటీవల మృతిచెందడంతో కుటుంసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా విజ్జయ్య చిత్రపటానికి కేటీఆర్ పూలమాలవేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందంగౌడ్, నారాయణరావుపేట మాజీ ఎంపీపీ బాలమల్లు, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, నాయకులు పాల్గొన్నారు.