కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 9: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని పాపమ్మపేట గ్రామం నుంచి పొట్ట చేతబట్టుకొని హైదరాబాద్‌కు వచ్చిన పొట్లూరి త్రినాథరావుకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ సంస్థలో వెల్డర్‌గా పనిచేస్తున్న త్రినాథరావు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోవడంతో ఆయన కుటుంబం రోడ్డున పడింది.
విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. పెద్ద మనసుతో ఆ కుటుంబానికి బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో ఓ ఇంటిని కేటాయించారు. దీంతో త్రినాథరావు కుటుంబసభ్యులు శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో గృహప్రవేశం చేశారు. కష్టకాలంలో అండగా నిలిచిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కృష్ణారావు, అధికారులకు, స్నేహితులకు జీవితాంతం రుణపడి ఉంటామని త్రినాథరావు కుటుంబసభ్యులు తెలిపారు.