హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): పల్లెప్రగతి విజయం, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే జాతీయస్థాయిలో తెలంగాణ పల్లెలకు 13 అవార్డులు దక్కాయని ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. వివిధ విభాగాలకు ప్రకటించిన మొత్తం 46 అవార్డుల్లో 13 తెలంగాణకే దక్కడం పట్ల మంగళవారం ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తంచేశారు. ప్రజోపయోగ కార్యక్రమాల అమలులో ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణ ముందంజలో ఉన్నట్టు మరోసారి వెల్లడైందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచ వారసత్వ నగర హోదా సాధించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మరో ట్వీట్లో కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ద్వారా గత కొన్నేండ్లుగా చేసిన పనుల ఫోటోలను కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.