హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది ఆచూకీ తెలియని విపతర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారని, ఇది దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘జరిగిన ఘోర దుర్ఘటనపై ముఖ్యమంత్రికే సీరియస్ నెస్ లేకుంటే ఇక అధికార యంత్రాంగానికి ఎకడ ఉంటది ? సహాయ చర్యలు ఎలా ముందుకు సాగుతాయి?’ అని సోమవారం ఎక్స్‌వేదికగా ప్రశ్నించారు. ‘జిల్లాలకు జిల్లాలు పర్యటిస్తూ ఓట్లవేట కోసం ముఖ్యమంత్రికి సమయం ఉన్నదిగాని, ఎస్ఎల్బీసీ సొరంగ బాధితుల ఆర్తనాదాలు వినేందుకు టైం లేదా? ఇందిరమ్మ రాజ్యం లో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? ప్రజాపాలన అంటే నోట్ల వేట.. ఓట్ల వేట మాత్రమేనా?’ అని నిలదీశారు. ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలు కొలికి రాకముందే, సొరంగంలో శకలాల కింద చిక్కినవారు బతికుండే అవకాశం కనిపించడం లేదని సరారు చేతులెత్తేసినట్టే కనిపిస్తున్నదని మండిపడ్డారు.
ప్రమాదంపై మౌనమెందుకు బండీ?
‘కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో ప్రమాదంపై నానా యాగీ చేసిన బండి సంజ య్.. ఎస్ఎల్బీసీ ఘటన జరిగి మూడు రోజులవుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారు?’ అంటూ కేటీఆర్ నిలదీశారు. ‘రేవంత్‌రెడ్డి మీద రహస్య ప్రేమకు నిదర్శనమా?’ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నాస్త్రా లు సంధించారు. ట్వీట్‌కు బండి సంజ య్ విమర్శల వీడియో ట్యాగ్ చేశారు.