హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్‌నాయక్ రూపొందించిన ‘నీ సాయం ప్రతి పేదవాడికి మనోధైర్యం..’ అలాగే నాగారం ప్రశాంత్ రూపొందించిన ‘అభివృద్ధి ప్రదాత కేటీఆర్’ అనే డాక్యుమెంటరీలు.. లీగల్‌సెల్ అడ్వకేట్ చైతన్య కిరణ్ ఆధ్వర్యంలో మానుకోట ప్రసాద్, సందీప్ రూపొందించి ఆలపించిన యువచైతన్యం పాటను శనివారం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు.
తెలంగాణ భవన్లో ఎరుకల ఆరాధ్య దైవం ఏకలవ్య మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బాల్క సుమన్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురుదక్షిణగా తన బొటనవేలిని సమర్పించిన మహాయోధుడని కిర్తీంచారు. ఏకలవ్య మహారాజ్ కీర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.