KTR | ఫార్ములా-ఈ కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం నుంచి ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా.. ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో సోమవారం విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావుతో కలిసి విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు నందినగర్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత తెలంగాణ భవన్‌కు చేరుకొని.. పార్టీ ముఖ్య నేతలతో కలిసి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఇదిలా ఉండగా.. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని అధికారులు కేటీఆర్‌కు చెప్పినట్లు సమాచారం. ఏసీబీ విచారణ ముగిసిన నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.