హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): శాసనసభ గ్యాలరీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందడి చేశారు. సమావేశాలను వీక్షించేందుకు మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బుధవారం అసెంబ్లీకి వచ్చారు.
ఈ క్రమంలో కేటీఆర్‌ను నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి తన వెంట గ్యాలరీకి తీసుకెళ్లారు. అక్కడ విద్యార్థులతో కేటీఆర్ ముచ్చటించారు.