కాళ్లు చచ్చుబడిపోయి ఇంటికే పరిమితమైన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి, కొత్తపల్లికి చెందిన సతీశ్, ప్రేమ్‌కుమార్‌ల శస్త్రచికిత్సకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. శుక్రవారం బాధితులు హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు. స్పందించిన కేటీఆర్ వారికి ఆపరేషన్ చేయాలని సన్‌షైన్ దవాఖాన చైర్మన్ గురువారెడ్డికి ఫోన్లో సూచించారు. అందుకయ్యే ఖర్చు తానే భరిస్తానని చెప్పారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చందర్‌కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. – పాలకుర్తి