KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు హరీష్‌రావు, కవిత ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఫార్ములా-ఈ కేసులో ఈ నెల 28న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసిందని కేటీఆర్ తెలిపారు. ఏసీబీ నోటీసులు జారీ చేయడాన్ని సోషల్ మీడియా వేదికగా కవిత ఖండించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. తమ పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందని.. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని స్పష్టం చేశారు. ఏసీబీ నోటీసులపై మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం స్పందించారు. ప్రతీకార రాజకీయాలు రేవంత్‌రెడ్డి అభద్రతా భావానికి స్పష్టమైన సంకేతాలని.. కల్పిత కేసులు న్యాయస్థానాల్లో నిలువవు.. ప్రజామోదాన్ని పొందవని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేటీఆర్‌కు అండగా నిలుస్తామని.. అంతిమంగా సత్యే గెలుస్తుందని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.