KTR | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థుల సాలర్షిప్ల విషయంలో రేవంత్రెడ్డి సరార్ నిర్లక్ష్యం వహిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా ఫీజు రీయింబర్స్మెంట్, సా లర్షిప్ల జాడేదని ప్రశ్నించారు.
బోధనా ఫీజుల బకాయిలు రూ.5,900 కోట్లకు చేరుకున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని, ఆ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారని నిలదీశారు. ఈ ఏడాది సాలర్షిప్ల దరఖాస్తులకు కూడా దికులేని పరిస్థితి తెచ్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఖరి కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు చదువులకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇం దుకు సర్కారే బాధ్యత వహించాలని చెప్పారు.
పేద విద్యార్థులంటే ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. సాలర్షిప్లు రాక ఎంతోమంది పేద విద్యార్థులు చదువు వదిలేసి కూలి పనికి వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వసతి గృహాల్లో మెయింటెనెన్స్ చార్జీలు కూడా రాకపోవటంతో విద్యార్థులు చదువుకు దూరం కావాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
సాలర్షిప్లు పెండింగ్ పెట్టడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ఫీజులు అందక యాజమాన్యాలు కూడా విద్యార్థులకు చదువు చెప్పలేని పరిస్థితి వచ్చిందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా పేద విద్యార్థుల తల్లితండ్రులు అప్పులు తెచ్చి పిల్లలను చదవిస్తున్నారని ఉదహరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటం మానేయాలని సూచించారు. వెంటనే బోధనా రుసుము బకాయిలు, సాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.