KTR | పాగల్ పాలనలో ఆగమైపోతున్న తెలంగాణ: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి అసమర్ధ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నదని విమర్శించారు. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో తెలంగాణ గరమైతున్నదని మండిపడ్డారు.
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అసమర్ధ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నదని విమర్శించారు. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో తెలంగాణ గరమైతున్నదని మండిపడ్డారు. అసమర్థ మూర్ఖ ఏలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా అసంతృప్తులు కొనసాగుతున్నాయని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది. కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుంది. మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుంది. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపంతో నా తెలంగాణ గరమైతుంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఎలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అసంతృప్తులివి.
ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్నలు. ‘హైడ్రా’ దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు. మూసీలో ఇండ్ల కూల్చివేతలపై దుమ్మెత్తిపోస్తున్న బాధితులు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్ల నిరసన. ఉపాధి దూరంచేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నల ధిక్కారం. ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల మహా ధర్నా. గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై భగ్గుమన్న విద్యార్థి లోకం. ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతల కన్నెర్ర. కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి. గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది
కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుంది
మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుంది
పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది
కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపం తో నా తెలంగాణ… pic.twitter.com/liaE7n0Jvb
— KTR (@KTRBRS) November 12, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

