హైదరాబాద్: ఢిల్లీకి చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రికి తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. ఐదు లక్షల రైతన్నలు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. రైతుబంధు కోసం కళ్లు కాయలుగాసేలా ఎదురుచూస్తున్నారని తెలిపారు. దళారుల చేతిలో పత్తి రైతులు దగాకు గురై అల్లాడుతున్నారని వెల్లడించారు. రైతు వ్యతిరేక పాలనతో తెలంగాణ ప్రజలకు ఈ దసరా దసరాలాగా లేదని ఎక్స్ వేదికగా చెప్పారు.
‘1 కాదు, 2 కాదు, 3 కాదు, 23 సార్లు హైద్రాబాద్-సికింద్రాబాద్కు తిరిగినట్టు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న నీకు తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా?. 5 లక్షల రైతన్నలు రూ.2 లక్షల రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. 67 లక్షల మందికి పైగా రైతన్నలు రైతుబంధు కోసం కండ్లు కాయలుగాసేలా ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంతో 43 లక్షల మంది పత్తి రైతులు దళారుల చేతిలో దగా అయ్యి అల్లాడుతున్నారు. నీ రైతు వ్యతిరేక పాలన పుణ్యమా అని ఈ దసరా తెలంగాణ ప్రజలకు దసరాలాగ లేకపాయే’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
1 కాదు, 2 కాదు, 3 కాదు, 23 సార్లు హైద్రాబాద్ – సికింద్రాబాద్ కు తిరిగినట్టు ఢిల్లీ కి చక్కర్లు కొడుతున్న నీకు తెలంగాణ గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా?
✳️ 5 లక్షల రైతన్నలు ₹ 2 లక్షల రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు
✳️ 67 లక్షల మందికి పైగా రైతన్నలు రైతు బంధు కోసం కండ్లు కాయలు… pic.twitter.com/p89WJ36PVh
— KTR (@KTRBRS) October 1, 2024