హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చే యాలని మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. లేదంటే రైతులందరితో కలిసి కేంద్రంపై యుద్ధం చేస్తామని హెచ్చరించారు. ధాన్యం సేకరణపై బీజేపీ ద్వంద్వ నీతిని, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న నాటకాలను ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. టీఆర్ఎస్ ట్విట్టర్ పేజీలో చేసిన ట్వీట్లను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది: ఎంపీ సంతోష్‌కుమార్
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం కేసీఆర్ నమ్ముతారని ఎంపీ సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణపై ఢిల్లీలో నిర్వహించిన దీక్షలో పాల్గొనడం సంతోషంగా ఉన్నదని ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశమని చెప్పారు. కేంద్రం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.