హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ): ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ దేశానికి వెళ్లిన హైదరాబాద్‌లోని వనస్థలిపురం విద్యార్థి మణిదీప్‌రెడ్డి 45 రోజులుగా కనిపించకుండా పోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు విద్యార్థి తల్లిదండ్రులను ఆదివారం కేటీఆర్ పరామర్శించారు. కుమారుడి ఆచూకీ తెలియక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
గత నెల 5నుంచి మణిదీప్‌రెడ్డి ఫోన్‌కాల్స్, మెసేజ్‌లకు స్పందించకపోవడం, అక్కడి అధికారుల నుంచి సమాచారం లేకపోవడం బాధాకరమని కేటీఆర్ ఆవేదన వ్య క్తంచేశారు. ఈ విషయంలో కేంద్రం, ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాల యం, తెలంగాణ పోలీసులకు హైకోర్టు నో టీసులు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామ ని కేటీఆర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు వీలైనంత త్వరగా సురక్షితంగా వెతికి పట్టుకునేలా చర్యలు తీసుకునేలా కోరారు.