హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, లగచర్ల బాధితులతో కలిసి సోమవారం ఉదయం జాతీయ మానవహక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, ఉమెన్ రైట్స్ కమిషన్ చైర్మన్లను కలిసి లగచర్ల ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీడియాతో మాట్లాడనున్నారు. లగచర్ల ఘటనపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిల వైఖరిని ఎండగట్టనున్నారు.