హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కిటెక్స్ సంస్థ ద్వారా 25,000 ఉద్యోగ అవకాశాలు సృష్టించడం చూస్తే చాలా ఆనందంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇండియాలో అత్యంత పెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్ను వరంగల్లో స్థాపించిన కేసీఆర్ ముందుచూపుకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ హయాంలో వరంగల్లో 1,350 ఎకరాల్లో టెక్స్టైల్స్ పార్ ఏర్పాటైన ఫొటోలను మంగళవారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 25,000 ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలని కిటెక్స్ ఇచ్చిన పత్రికా ప్రకటనను పోస్టు చేశారు.