గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆమె తండ్రి లింగ్యానాయక్ ఈ నెల 17 మరణించడంతో.. మంత్రి కేటీఆర్ ఆదివారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని ఆమె నివాసానికి చేరుకొని లింగ్యానాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్‌తోపాటు ఆమె తల్లి దష్సి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
– మహబూబాబాద్, నమస్తే తెలంగాణ