KTR : జంతర్ మంతర్ నుంచి ‘ఛలో పార్లమెంట్’కు బయల్దేరిన విద్యార్థులపై, నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఖండించారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్న వారిపై దాడి అప్రజాస్వామికమని కేటీర్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంపై మండిపడిన కేటీఆర్.. ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పలేరని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
‘ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం అప్రజాస్వామికం. ఇది చాలా సిగ్గుచేటు. ప్రశ్నలకు లాఠీలు, టియర్ గ్యాస్‌లతో సమాధానం చెప్పలేరు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కును ప్రసాదించింది. ఆ హక్కును మా నుంచి మీరు లాక్కోలేరు. ఈ ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ధిక్కార స్వరం వినిపించేవాళ్లపై దాడి చేయించడం కేంద్ర ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలి. జవాబుదారీతనం కోసం పోరాడుతున్న ప్రతి విద్యార్థికి, ప్రతి పౌరుడికి సానుభూతి తెలుపుతున్నా. జాగ్రత్తగా ఉండండి’ అని కేటీఆర్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
Delhi Police lathicharging peaceful, unarmed protestors is extremely undemocratic and shameful
You cannot answer questions with lathis and tear gas
The Constitution gives every citizen the right to question. That right cannot be beaten out of us
I strongly condemn this. Union…
— KTR (@KTRBRS) July 20, 2026