KTR | కేసీఆర్పై కక్షతో రైతులను గోసపెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కన్నెపల్లి గేట్లు ఎత్తితే నీళ్లు వస్తాయని కాంగ్రెస్ నాయకులకూ తెలుసని తెలిపారు. నీళ్లిస్తే యూరియా ఇవ్వాలి.. పంటలు పండితే మద్దతు ధర ఇవ్వాలలి.. పంట పండితే కరెంట్ ఇవ్వాలి.. బోనస్ ఇవ్వాలనేది కాంగ్రెస్ భయమని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ, ఎన్డీయేను అడ్డం పెట్టుకుని రేవంత్ బతకాలని అనుకుంటున్నారని తెలిపారు. కాళేశ్వరం కేసీఆర్ ఇచ్చిన వరం అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రాష్ట్రానికి పట్టిన శనేశ్వరం అని విమర్శించారు. కేసీఆర్కు వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పజెప్పు.. తెలంగాణ అంతటికీ నీళ్లు పారించి చూపిస్తామని సవాలు విసిరారు.
కన్నెపల్లి దగ్గర లక్ష క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయని.. మోటార్లు ఆన్ చేస్తే వారం రోజుల్లోనే అన్ని రిజర్వాయర్లను నింపవచ్చని కేటీఆర్ తెలిపారు. కానీ నీళ్లు నింపి రైతులకు సాగునీటిని అందిస్తే యూరియా ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వానికి యూరియా ఇచ్చే మొహం లేదని విమర్శించారు. పంట పండితే కొనే తెలివి లేదు.. పంట కోసం కరెంటు ఇవ్వాలి.. అదిచ్చే తెలివి లేదన్నారు. పంటకు మద్దతు ధర ఇవ్వాలి.. రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలి, పంటకు బోనస్ ధర ఇవ్వాలి.. అవేవీ ఇచ్చే తెలివి లేదని అన్నారు. అందుకే నీళ్లు లిఫ్ట్ చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ నాశనమైనా సరే రేవంత్ రెడ్డి చూస్తూనే ఉంటాడని, మమ్మల్ని బద్నాం చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీకు మేడిగడ్డ రిపేర్ చేసే తెలివిలేకపోతే ఒక్క వారం రోజులు కేసీఆర్ గారికి అప్పజెప్పు
మొత్తం తెలంగాణ అంతా నీళ్లు పారేలాగా చేసే బాధ్యత మాది
– కేటీఆర్ pic.twitter.com/SGZgTDXhDV
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2026
ఎల్నినో, సూపర్ ఎల్నినో వస్తుందని మూడు నెలల క్రితమే హెచ్చరించారని కేటీఆర్ తెలిపారు. 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ తాగునీటితో సహా ఉమ్మడి 7 జిల్లాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇవ్వవచ్చని తెలిపారు. కానీ ఇప్పుడు సాగునీళ్లే కాదు.. హైదరాబాద్ తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే 50 వేల మందితో ముట్టడించి కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయకపోతే 50–60 వేల మందితో కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించి మేమే పంపులు ఆన్ చేస్తాం
– కేటీఆర్ pic.twitter.com/sq9cb2G1Gp
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2026
రైతుల కోసం రూ.5లక్షల కోట్లు ఖర్చు పెట్టామని కేటీఆర్ తెలిపారు. కరెంటు మెరుగుపరిచేందుకు లక్ష కోట్లు, 24 గంటల కరెంటుకు 50వేల కోట్లు ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు అన్నింటికీ కలిపి రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. రైతుబంధుకు రూ.72వేల కోట్లు, రైతుబీమా రూ.30వేల కోట్లు ఇచ్చామని అన్నారు. అవేవీ పరిశీలించకుండానే 48 గంటల్లోనే ఎస్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చిందని మండిపడ్డారు. రైతుకు నీళ్లు ఉన్నా.. నీళ్లు లిఫ్ట్ చేసే సోయి రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. ఎల్అండ్టీ మేడిగడ్డ మరమ్మతుకు ముందుకొచ్చినా చేయించలేదని తెలిపారు. కేసీఆర్ మీద కక్షతో రేవంత్ రెడ్డి రైతులకు శిక్ష వేస్తున్నారని మండిపడ్డారు.