నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పరువుకు భంగం కలిగించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ను న్యాయస్థానం అంగీకరించింది. ఆమెపై కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
కేటీఆర్ పిటిషన్పై ఇప్పటికే సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేయడంతోపాటు కొండా సురేఖ వ్యాఖ్యలపై పత్రికలు, టీవీ చానళ్లల్లో వచ్చిన వార్తా కథనాలను పరిశీలించిన కోర్టు.. వచ్చేనెల 9న విచారణకు హాజరుకావాలని ఆమెకు సమన్లు జారీ చేసింది.