హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను గురువారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ భవన్‌ను గులాబీవర్ణంలో ముస్తాబు చేసి, కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ సంప్రదాయబద్ధమైన ఆర్చిని ఏర్పాటుచేశారు. గులాబీ బెలూన్లు, తోరణాలు, పూలమాలలతో అందంగా అలంకరించారు.
భవన్ ఎదుట, సమీపంలో పెద్ద ఎత్తున అభిమానులు కేటీఆర్ బర్త్‌డే ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. కేటీఆర్ ఉద్యమ ప్రస్థానం, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆయన అభివృద్ధి కార్యక్రమాల చిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. చిన్ననాటి నుంచి ఈనాటి వరకు కేటీఆర్ జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఆవిష్కరించేలా భవన్ ప్రాంగణంలో డాక్యుమెంటరీని ప్రదర్శించారు. పార్టీ నాయకులు కేటీఆర్ కోసం పెద్ద పెద్ద బర్త్ కేక్‌లను తీసుకొచ్చారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో తెలంగాణభవన్‌లో కేటీఆర్ అడుగుపెట్టగానే ‘హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అన్న’ అంటూ పార్టీ శ్రేణులు చేసిన నినాదాలు మిన్నంటాయి.
తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆశీస్సులను అందించి, ఆలింగనం చేసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
తన పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు, అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని కేటీఆర్ తెలిపారు. కిక్కిరిసిన పార్టీ శ్రేణులు, అభిమానుల కోలాహలం నడుమ కేటీఆర్ తెలంగాణ భవన్‌లోని సమావేశ హాలులోకి అడుగుపెట్టారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితర నేతల సమక్షంలో భారీ బర్త్‌డే కేక్‌ను కేటీఆర్ కట్‌చేశారు. అనంతరం మాజీ మంత్రులు, నేతలు కేటీఆర్‌కు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు చెప్పడానికి తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తనపై చూపే ప్రేమ, ఆశీర్వాదాలతో తాను మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానని చెప్పారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, తక్కెళ్ల్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, ముఠా గోపాల్, అనిల్‌జాదవ్, కోవా లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ బండ ప్రకాశ్, మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గాదరి కిశోర్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, మహే శ్ బిగాల, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, చంద్రావతి, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, రవికుమార్‌గౌడ్, ఆంజనేయగౌడ్, రాకేశ్, వాసుదేవరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, రజినీ, ప్రతాప్‌రెడ్డి, భిక్షపతి, నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, క్యామ మల్లేశ్, నాయకులు తుల ఉమ, సాయికిరణ్‌యాదవ్, జాన్సన్‌నాయక్, రామచంద్రునాయక్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, అభిలాశ్, గాంధీనాయక్, విజయ్‌కుమార్, తుంగ బాలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్‌డే వేడుకలను గురువారం ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో బీఆర్ఎస్ యూస్ఏ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేట్ కట్ చేశారు. కేటీఆర్ కటౌట్లను ప్రదర్శిస్తూ పుట్టినరోజు గ్రీటింగ్స్ చెప్పారు. బీఆర్ఎస్ యూకే శాఖ ఉపాధ్యక్షుడు హరిగౌడ్ నవాపేట ఆధ్వర్యంలో లండన్‌లో కేక్ కట్ చేశారు. పెద్దసంఖ్యలో ఎన్నారైలు హాజరయ్యారు. ‘లాంగ్‌లివ్ రామన్న’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూకే శాఖ అధ్యక్షుడు నవీన్‌రెడ్డి, నాయకులు సత్యమూర్తి చిలుముల, రవికుమార్ రెటినేని, అశోక్‌గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ సౌతాఫ్రికా శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో జోహెన్స్‌బర్గ్‌లో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఎన్నారైలు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. గిఫ్ట్ ఏ ైస్మెల్లో భాగంగా విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఎన్నారైలు నరేందర్‌రెడ్డి, హరీశ్రంగా, జ్యోతి వాసిరెడ్డి, జైవిష్ణు గుండా పాల్గొన్నారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేటీఆర్ బర్త్‌డే సెలబ్రెషన్స్ నిర్వహించారు. మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గురువారం పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పా రు. ‘మీరు వేసే ప్రతి అడుగు విజయవం తం కావాలి. మీ కలలు సాకారం కావా లి’ అని ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యు లు దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి కేటీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ‘అన్నయ్య.. హ్యాపీ బర్త్‌డే.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నం’ అని పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, దేశపతి శ్రీనివాస్, సుభాశ్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.