హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లా భైంసాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై జరిగిన దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకుడు తుంగబాలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్‌పై టమాటాలు, రాళ్లతో దాడి చేయడం అమానుషమని తెలిపారు.
హింసను నమ్ముకొని గెలవాలనుకోవడమనే భావన మీదయితే, అహింసతో అందరి మనసులు గెలుచుకోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ నైజమని తెలిపారు.