Republic Day | భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. భారత పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించే దిశగా భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన పండుగ వేళ ఈ రోజు అని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో.. దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి పునరంకితమవుదామని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతినబూనుదామని పిలుపునిచ్చారు.
రాజ్యాంగాన్ని రూకల్పన చేసిన మహానుభావుల దూరదృష్టిని, వారు మనకు అప్పగించిన విలువలను స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదని హరీశ్‌రావు అన్నారు. ఆ విలువలు కాపాడుకుంటూ, దేశ సమగ్రతను రక్షించేందుకు ప్రజలంతా ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.