హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ): ‘ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడొద్దు.. పార్టీ తరఫున అండగా ఉంటాం.. అంతా మంచే జరుగు తుంది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు భరోసానిచ్చారు. సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్‌రెడ్డిని సోమవారం వారు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసు కున్నారు. వైద్యులు సుదర్శన్‌రెడ్డికి అందిస్తున్న చికిత్స వివరాలు, ఆరోగ్యపరిస్థితిని వారికి వివరించారు. ఈ సందర్భంగా మరింత మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు విజ్ఞప్తిచేశారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి భార్య స్వప్న, కూతురిని ఓదార్చారు. అన్నివిధాల సహకరిస్తామని ధైర్యం చెప్పారు.
పెద్దికి మంత్రి సీతక్క పరామర్శ
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక పరామర్శించారు. సోమవారం దవాఖానకు వచ్చిన మంత్రి.. పెద్ది ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సుదర్శన్‌రెడ్డికి అందుతున్న వైద్య చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్న సీతక.. అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. సుదర్శన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.