హైదరాబాద్, ఆగస్టు15 (నమస్తే తెలంగాణ) : ఇప్పటికీ శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లు పూర్తిగా నిండనేలేదు. ఉన్న జలాల్లో నీటివాటాలకు తె లంగాణ, ఏపీ రాష్ర్టాలు అప్పుడే పట్టుబడుతున్నాయి. ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం ఉన్న నీళ్లన్నీ తమకే దక్కుతాయని వాదనలకు దిగుతున్నాయి. ఈక్రమంలో ప్ర తిపాదనలు సమర్పించాయి. వాటాలు తేలకుండానే కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సైతం త్రీమెన్ కమిటీ సమావేశానికి సిద్ధమైంది. శ్రీశై లం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్ర వాహాలు మొదలయ్యాయి. ఇదే అదునుగా ఏపీ సర్కార్ ఇండెంట్లు, అనుమతులు లేకుండానే పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు చేపట్టింది. 2026-27కి సంబంధించి శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నుంచి కేవలం జలాల వినియోగాల అంశంపైన మాత్రమే మీటింగ్ ఏర్పాటు చేయాలంటూ లేఖ రాయడం, అదే తడవుగా కేఆర్ఎంబీ సైతం సిద్ధమైంది.
కేవ లం రిజర్వాయర్లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటినిల్వలు, రాష్ర్టాల నీటి అవసరాలపై మాత్రమే చర్చించే సింగిల్ ఎజెండాతోనే సోమవారం(రేపు) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశం కోసం ఇరురాష్ర్టాలు ప్రతిపాదనలు పం పాయి. ఈ రిజర్వాయర్లలోని జలాలన్నీ తమకే దక్కుతాయని ఎవరికి వారు పోటాపోటీగా డిమాండ్లు ముందుపెట్ట డం గమనార్హం. ప్రస్తుతం శ్రీశైలం, సాగ ర్ రిజర్వాయర్లలో కలిపి వినియోగానికి అందుబాటులో ఉన్నవి 146 టీఎంసీల ని, ఆ జలాల్లో 70% వాటా (115.70 టీఎంసీలు)ను తమకే కేటాయించాలని, తెలంగాణకు 30%వాటా (30.85 టీఎంసీలు) చాలని ఏపీ పేర్కొన్నది. అదేసమయంలో బేసిన్ పారామీటర్స్ ప్రకారం తెలంగాణ సైతం ఉన్న జలాల్లో 71శాతం వాటా డిమాండ్ చేసింది. ఏపీకి 29శాతం వాటానే ఉంటుందని వెల్లడించింది. ఎవరికి వారుగా వాటాలను స్వయంగా ప్రకటించుకున్నాయి. ఇరురాష్ర్టాలు ముందుగానే డిమాండ్లు పెట్టడం, కేఆర్ఎంబీ సైతం బోర్డు స మావేశం ఊసెత్తకుండా, కేవలం త్రీ మెన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేయడం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.