హైదరాబాద్, మే4 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి వేసవి తాగునీటి అవసరాలపై కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ సోమవారం సమావేశం కానున్నది. రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవాలనేది కేఆర్ఎంబీ ఆధ్వర్యంలోని త్రీమెన్ కమిటీ నిర్ణయిస్తుంది. బోర్డు మెంబర్ సెక్రటరీ, ఇరు రాష్ర్టాల ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)లతో కూడిన ఈ కమిటీ ఏటా సీజన్లవారీగా ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేస్తున్నది.