హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : ఎట్టకేలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశాన్ని ఈ నెల 21న నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ అధికారులు సమాచారం అందించారు. వాస్తవంగా బోర్డు సమావేశాన్ని నవంబర్లోనే నిర్వహించాలని తొలుత ఖరారు చేశారు. ఏజెండా అంశాలను పంపించాలని తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు బోర్డు లేఖ రాసింది. అయితే ఒకసారి ఏపీ, మరోసారి తెలంగాణ ప్రభుత్వం సమావేశాన్ని వాయిదా వేయాలని కోరడంతో కేఆర్ఎంబీ ఆ మేరకు సమావేశాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. చివరికి ఈ నెల 21న సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.