హైదరాబాద్ : కృష్ణా యాజమాన్య బోర్డు ఎర్రమంజిల్లోని జలసౌధలో గురువారం సమావేశమైంది. సమావేశానికి తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు హాజరయ్యారు. వరద జలాల లెక్కింపుపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే శ్రీశైలం, నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి కోసం విధివిధానాలు, రూల్ కర్వ్స్పై సైతం కేఆర్ఎంబీ చర్చించనున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో జలాశయాల నిర్వహణ కమిటీ సమావేశంలో రూల్ కర్వ్స్ విషయమై చర్చించి, రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నారు. వాటికి అనుగుణంగా మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇవాళ భేటీ జరుగుతున్నది.